: ఉత్తమ కుమార్ రెడ్డి గారూ! రాహుల్ గాంధీ కూడా బచ్చానే: టీ మంత్రి కేటీఆర్


తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను ‘బచ్చా’ అంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా సమాధానం చెప్పారు. ‘ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో అయితే పని చేస్తున్నారో, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి ఆయన ఆదేశాలు తీసుకుంటున్నారు. రాహుల్ గాంధీ నా కంటే రెండు, మూడేళ్లు పెద్దవాడు. అంటే, ఆయన కూడా బచ్చానే. మరో బచ్చాగాడి పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పని చేస్తారు. ఆయన ఆదేశాలు తీసుకుంటారు... ఆయన అపాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి ఎదురుచూస్తారు. నన్నేమో ఈరోజు బచ్చా అంటావు. ఇది విజ్ఞతకు సంబంధించిన అంశం. ‘బచ్చా’ అని నన్ను అంటే, అవమానించినట్లుగా నేనేమీ అనుకోవడం లేదు. ఈరోజు దేశంలో 65 శాతం మంది బచ్చా గాళ్లే ఉన్నారు. ఈ విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్చిపోతున్నాడు. ఆ బచ్చాగాళ్లకు దూరమైంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధోగతి పాలైంది. ఇకనైనా ఉత్తమ్ కుమార్ రెడ్డిగారు మాటతీరు సవరించుకోవాలి’ అని కేటీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News