: ఇది ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయం: సోనియా గాంధీ
ఉత్తరాఖండ్ లోని అసెంబ్లీ విశ్వాస పరీక్షలో నెగ్గడంపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 34 ఓట్లు వచ్చినట్టు ఆమె తెలిపారు. మెజారిటీకి 31 ఓట్లు కావాల్సి ఉండగా, 34 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి షాకిచ్చింది. కాంగ్రెస్, హరీష్ రావత్ కు ఇది గొప్ప విజయమని ఆమె పేర్కొన్నారు. కాగా, ఉత్తరాఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్ష ఫలితాలను రేపు సుప్రీంకోర్టు అధికారికంగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. తాజా విజయంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉప్పొంగుతోంది.