: అభిమానులను సలహాలు అడుగుతున్న బిగ్ బీ
సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో నిత్యమూ తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 'టీఈ3ఎన్' ప్రమోషన్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేయాలని తన అభిమానుల నుంచి సలహాలను అడుగుతున్నాడు. ఈ మేరకు ఫ్యాన్స్ ను ఉద్దేశించి ట్విట్టర్ ఖాతాలో రిక్వెస్ట్ పెట్టాడు. సినిమా పోస్టర్ ఎలా వుండాలన్న విషయం నుంచి పబ్లిసిటీకి ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని కోరాడు. ఈ చిత్రం జూన్ 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ థ్రిల్లర్ గా తయారవుతున్న చిత్రంలో అమితాబ్ తో పాటు విద్యాబాలన్, నవాజుద్దీన్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.