: గూగుల్ ఉచిత వైఫై రైల్వే స్టేషన్ల సంఖ్య 15కి చేరింది.. డిసెంబరులోపు 100 రైల్వే స్టేషన్లకు అందించ‌డ‌మే లక్ష్యం


భారత్‌లోని 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై స‌దుపాయాన్ని అందించ‌డ‌మే ల‌క్ష్యంగా రైల్‌టెల్‌ నెట్‌వర్క్ తో క‌లిసి గూగుల్ ప‌నులు మొద‌లు పెట్టిన సంగ‌తి విధిత‌మే. గూగుల్ నుంచి ఉచిత వైఫై సౌక‌ర్యం పొందుతోన్న జాబితాలో మ‌రో ఐదు రైల్వేస్టేష‌న్లు చేరాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు ఈ స‌దుపాయాన్ని పొందుతోన్న రైల్వేస్టేష‌న్ల సంఖ్య 15కి చేరింది. ఈ ఏడాది డిసెంబ‌రు నాటికి 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై అందించ‌నున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా గూగుల్ సంస్థ పేర్కొంది. తాజాగా ఉజ్జయిని, జైపూర్‌, పాట్నా, గువాహటి, అలహాబాద్ లోని రైల్వే స్టేష‌న్లలో ఈ సౌక‌ర్యాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News