: వేణు మాధవ్ ను బతికుండగానే చంపేసిన తెలుగు ఛానెల్, వెబ్ సైట్లు!... పోలీసులకు ఫిర్యాదు చేసిన కమెడియన్


టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్ ను ఓ తెలుగు టీవీ ఛానెల్, రెండు సోషల్ మీడియా వెబ్ సైట్లు బతికుండగానే చంపేశాయి. దీంతో షాక్ తిన్న ఆ కమెడియన్ నేరుగా పోలీసులకు పిర్యాదు చేసి తాను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే... ఓ తెలుగు టీవీ చానెల్, రెండు సోషల్ మీడియా వెబ్ సైట్లు నేటి ఉదయం వేణు మాధవ్ చనిపోయినట్లు వార్తలు ప్రసారం చేశాయి. ఈ విషయం తెలుసుకుని షాక్ తిన్న వేణుమాధవ్ నేరుగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన మరణంపై వార్తలు ప్రసారం చేసిన టీవీ ఛానెల్, సోషల్ మీడియా వెబ్ సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. వేణు మాధవ్ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు ఛానెల్ ప్రసారాలు, సోషల్ మీడియా వెబ్ సైట్లలో ప్రచురితమైన వార్తలను పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News