: మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటన!... శాంతించిన రాజధాని కార్మికులు


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో కొనసాగుతున్న తాత్కాలిక సచివాలయం పనుల వద్ద గంటల తరబడి కొనసాగిన హైటెన్షన్ వాతావరణం చల్లబడింది. రాజధాని కార్మికులు శాంతించారు. ఆందోళన విరమించారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రమాదవశాత్తు కాంక్రీట్ మిల్లర్ లో పడిపోయిన ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికుడు దేవేందర్ చనిపోయాడు. కార్మికుడి కుటుంబానికి పరిహారంపై నోరెత్తని పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించారు. దీంతో భగ్గుమన్న కార్మికులు ఆందోళనకు దిగారు. అంబులెన్స్ కు నిప్పు పెట్టిన కార్మికులు ఎల్ అండ్ టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఐజీ సంజయ్ కార్మికులతో మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలతోనూ ఆయన సంప్రదింపులు జరిపారు. అప్పటికే అక్కడికి చేరుకున్న కొందరు అధికారులు ఎల్ అండ్ టీ యాజమాన్యంతోనూ చర్చించారు. ఆ తర్వాత ప్రభుత్వం, ఎల్ అండ్ టీ తరఫున దేవేందర్ కుటుంబానికి రూ.20 లక్షల పరిహారాన్ని అందించేందుకు అధికారులు అంగీకరించారు. దీంతో శాంతించిన కార్మికులు ఆందోళనను విరమించారు.

  • Loading...

More Telugu News