: వైకాపా ఎమ్మెల్యేకి సుప్రీంలో ఎదురుదెబ్బ... ప్రకాశం బ్యారేజిపైకి భారీ వాహనాలను అనుమతించవద్దన్న పిటిషన్ కొట్టివేత


విజయవాడలోని ప్రకాశం బ్యారేజిపై భారీ వాహనాలను అనుమతించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొద్ది సేపటి క్రితం కొట్టేసింది. ఈ పిటిషన్ రాజకీయ కారణాలతో దాఖలైనట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డ ధర్మాసనం, కేసును పరిష్కరించుకునేందుకు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. అంతకుముందు విచారణ సందర్భంగా ప్రకాశం బ్యారేజిపై భారీ వాహనాలు వస్తున్నాయని, దీనివల్ల బ్యారేజ్ భవితవ్యం దెబ్బతింటోందని, ప్రభుత్వానికి ఇదే విషయాన్ని చెప్పినా పట్టించుకోవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. ప్రభుత్వానికి నోటీసులు పంపాలని కోరగా, సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ముందు హైకోర్టుకు వెళ్లాలని సలహా ఇచ్చింది.

  • Loading...

More Telugu News