: మాకు 34... బీజేపీకి 28: బల పరీక్ష ఓట్ల వివరాలను చెప్పేసిన హరీశ్ రావత్
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం ముగిసిన బల పరీక్షలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ నెగ్గేశారు. తన పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలను లాగేసుకుని రాష్ట్రంలో తన పదవి కిందకు నీళ్లు తెచ్చిన బీజేపీకి షాకిచ్చిన హరీశ్ రావత్... బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేను తన వైపు లాక్కున్నారు. ఇక బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా దక్కించుకున్న రావత్ బల పరీక్షలో నెగ్గారు. ఓటింగ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన రావత్ మీడియాతో మాట్లాడుతూ తమకు 34 ఓట్లు రాగా, విపక్ష బీజేపీకి 28 ఓట్లు మాత్రమే వచ్చాయని ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని రేపు సుప్రీంకోర్టు అధికారికంగా ప్రకటించనుందని ఆయన తెలిపారు.