: ఆడ‌పిల్ల చ‌దువు కాదిక భారం.. విద్యకోసం అమ్మాయిలకు త‌క్కువ రేట్ల‌కే రుణాలిచ్చే యోచ‌న‌లో కేంద్రం


ఆర్థిక ఇబ్బందుల‌తో ఉన్న‌త విద్యను కొన‌సాగించ‌లేక‌పోతోన్న ఆడ‌పిల్ల‌ల‌కు కేంద్రం శుభ‌వార్త అంద‌జేయ‌నుంది. ఆడ‌పిల్ల‌ల చ‌దువు కోసం చేసే రుణాలపై భారం ప‌డ‌కుండా కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంది. బేటీ బచావో, బేటీ పడావో ప‌థ‌కం కింద త‌క్కువ రేట్ల‌కే విద్యార్థినుల‌కు రుణాలు ఇప్పించే సౌల‌భ్యాన్ని కల్పించాల‌ని కేంద్ర మంతులు స్మృతి ఇరానీ, అరుణ్ జైట్లీకి కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖా మంత్రి మేనకాగాంధీ తాజాగా లేఖ రాశారు. దీంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు అబ్బాయిల‌తో పాటు అమ్మాయిల‌ను కూడా ఉన్న‌త విద్యకు పంపించేలా ప్రోత్సాహం ల‌భిస్తుంద‌ని యోచిస్తున్నారు. అమ్మాయిల ఉన్నత విద్య కోసం త‌ల్లిదండ్రులు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తార‌ని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News