: ఐదేళ్ల అనంతరం అజారుద్దీన్ కు ఫోన్ చేసిన సంగీతా బిజిలానీ!


బాలీవుడ్ నటి, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మాజీ సతీమణి సంగీతా బిజిలానీ, దాదాపు ఐదు సంవత్సరాల అనంతరం తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. అజర్ జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న 'అజర్' చిత్రంలో తన పాత్రను చిత్రీకరించిన తీరుపై ఆమెకున్న అనుమానాలను తీర్చుకునేందుకే ఈ ప్రైవేట్ ఫోన్ కాల్ చేసినట్టు సమాచారం. తన పాత్రను పరిమితం చేసి, ఓ కుటుంబాన్ని విడదీసిన యువతిగా తనను చిత్రంలో చూపించారన్నది ఆమె వాదనగా తెలుస్తోంది. చిత్రాన్ని తనకు ముందే చూపించాలని కూడా ఆమె కోరినట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. మే 13న విడుదల కానున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి, నర్గిస్ ఫక్రి, ప్రాచీ దేశాయ్ నటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News