: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. గతేడాది కంటే మూడు శాతం పెరిగిన ఉత్తీర్ణత
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖపట్నంలో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫలితాల్లో మొత్తం 94.52శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు 6,82,374మంది విద్యార్థులు హాజరు కాగా 6,02,871 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 94.33గా ఉంటే, బాలికల ఉత్తీర్ణత శాతం 94.77గా ఉంది. 98.89శాతంతో ఉత్తీర్ణతలో కడప జిల్లా ప్రథమ స్థానంలో నిలిస్తే, 90.11శాతం ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా చివరిస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే మూడు శాతం ఉత్తీర్ణత పెరిగింది. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్ లోనే టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు.