: ‘హోదా’ కోసం నేడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ధర్నాలు.. కాకినాడలో జగన్ ఆధ్వర్యంలో నిరసన
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నారు. కాకినాడలో జరిగే ధర్నాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాల్గొననున్నారు. మరికాసేపట్లో జగన్ కాకినాడకు చేరుకోనున్నారు. ఏలూరు ధర్నాలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్, మేకా శేషుబాబు పాల్గొంటారు. తిరుపతిలో వైఎస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు వైసీపీ నేతలు నిరసన తెలియజేస్తారు.