: ఎంసెట్ ర్యాంకు కోసం తొందరపడకండి...మీ సెల్ కే రిజల్ట్ వస్తుంది: గంటా


ఎంసెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విశాఖపట్టణంలో ఆయన ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ, కేవలం ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలను మాత్రమే విడుదల చేస్తున్నామని అన్నారు. నీట్ పై సుప్రీంకోర్టు తీర్పును చదివిన అనంతరం ఎంసెట్ పై ఓ ప్రకటన విడుదల చేస్తామని ఆయన చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 10 శాతం ఎంసెట్ ఉత్తీర్ణత తగ్గిందని ఆయన చెప్పారు. టాప్ టెన్ ర్యాంకులన్నీ అబ్బాయిలవేనని ఆయన చెప్పారు. మే 27 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుందని, జూన్ మొదటి వారంలో ఆప్షన్స్ ఎంపిక ఉంటుందని, ఆ తరువాత జాయినింగ్స్ ఉంటాయని ఆయన తెలిపారు. రిజల్ట్స్ కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్లికేషన్ నింపిన సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ కు మీ ర్యాంకు ఎంతన్నది వస్తుందని ఆయన తెలిపారు. ఈ విధానం తొలిసారి అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News