: 27 నుంచి తిరుపతిలో టీడీపీ మహానాడు


చిత్తూరు జిల్లా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ నేత టీడీ జనార్దన్ ఒక ప్రకటన చేశారు. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ లో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జన్మించిన మే 27వ తేదీని ఆ పార్టీ మహానాడుగా ప్రతి ఏటా నిర్వహిస్తుంది. ఈ సమావేశాల్లో ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను, అజెండాలను, వివిధ సమస్యలపై పార్టీ తీర్మానాలను ప్రకటించడం, పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఆనవాయతీ. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News