: నేను తండ్రిని కాబోతున్నాను: క్రికెటర్ సురేశ్ రైనా
తాను తండ్రి కాబోతున్నట్లు టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా పేర్కొన్నాడు. ఈ విషయాన్ని తనే వెల్లడించాడు. ఈ సందర్భంగా రైనా మాట్లాడుతూ, తన భార్య ప్రియాంకను కలిసేందుకు హాలండ్ బయలుదేరానని, రేపు ఆమెను కలువబోతున్నానని, తనకెంతో ఉద్వేగంగా ఉందని చెప్పాడు. కాగా, నిన్న మదర్స్ డే సందర్భంగా రైనా తన తల్లికి శుభాకాంక్షలు తెలిపాడు. కాబోయే తల్లిని చూసేందుకు ఆతృతగా ఉన్నానంటూ తన భార్యను ఉద్దేశించి కూడా ఆ ట్వీట్ లో రైనా ప్రస్తావించాడు.