: చంద్రబాబుపై జగన్ పుస్తకం అంతా ట్రాష్: టీడీపీ నేత గాలి


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రించిన పుస్తకం అంతా ట్రాష్ అని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డట్లు ఆ పుస్తకంలో ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని చూసుకుని జగన్ తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకున్నారని, బ్లాక్ మనీని విదేశాల్లో వైట్ మనీగా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని జగన్ మంట గలుపుతున్నారని గాలి ముద్దు కృష్ణమనాయుడు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News