: విజయవాడలో రౌడీల వీరంగం..కూలీలను చితకబాదిన వైనం
విజయవాడలో రౌడీలు రెచ్చిపోయారు. మొగ్రలాజపురంలో రౌడీలు వీరంగం సృష్టించారు. ఇసుక మోసే కూలీలపై కర్రలతో దాడి చేశారు. ఇసుక మోయాలంటే ఒక్కొక్కరు తమకు రూ.200 చెల్లించాలని రౌడీలు డిమాండ్ చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ సదరు కూలీలు ప్రశ్నించడంతో వారిపై కర్రలతో దాడికి దిగారు. కాగా, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కూలీలు ఆరోపించారు. దీంతో, తమకు న్యాయం చేయాలంటూ మాచవరం పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కూలీలు ఆందోళనకు దిగారు.