: 45 మంది తాలిబాన్లను మట్టుపెట్టిన ఆఫ్ఘన్ భద్రతా దళాలు
తాలిబాన్లు పన్నిన ఉగ్ర దాడులను ఆఫ్ఘనిస్తాన్ భద్రతా బలగాలు పటాపంచలు చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ లోని కునార్ ప్రావిన్స్ లోని ఘజియాబాద్ జిల్లాలోని పలు సెక్యూరిటీ పోస్టుల వద్ద ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు యత్నించగా భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 45 మంది తాలిబన్ ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో ఒక ఆర్మీ అధికారి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు తెలిపారు.