: దేవి మృతి కేసులో భరతసింహారెడ్డికి రిమాండ్


సంచలనం సృష్టించిన దేవీరెడ్డి మృతి కేసులో నిందితుడు భరతసింహారెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. తన స్నేహితురాలిని పబ్ నుంచి తీసుకెళ్లి ఇంట్లో దించాలన్న తొందర, మద్యం సేవించిన స్థితి వెరసి దేవీరెడ్డి ఇంటికి సమీపంలోనే కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనగా, ఆమె అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. భరతసింహారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టిన పోలీసులు, ఈ ఉదయం తొలుత ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరచగా, ఈ నెల 23వ తేదీ వరకూ రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఆపై పోలీసులు భరత్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో తొలుత దేవిపై అత్యాచారం, హత్య జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పటికీ, పోలీసుల విచారణలో కేవలం యాక్సిడెంట్ కారణంగానే మరణం సంభవించిందని వెల్లడైంది.

  • Loading...

More Telugu News