: తమిళ మీడియాపై నిప్పులు చెరిగిన విజయ్ కాంత్


మీడియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, మండిపడటం డీఎండీకే చీఫ్, సినీనటుడు విజయ్ కాంత్ కు కొత్తేమీ కాదు. తాజాగా, తమిళనాడుకు చెందిన రెండు ఛానెళ్లపై ఆయన నిప్పులు చెరిగారు. త్వరలో తమిళనాట ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు ఛానెళ్లు పోల్ సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఆ సర్వే ఫలితాల్లో ఒకటి ఏఐడీఎంకే, రెండోది డీఎంకే విజయం సాధిస్తాయని పేర్కొన్నాయి. దీంతో, ఈ సర్వేలు తప్పుడు తడికెలని, ఒక వ్యూహం ప్రకారమే ఈ సర్వే ఫలితాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తన పార్టీ ఘన విజయం సాధిస్తుందని విజయ్ కాంత్ జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News