: ప్రధానికి కొణతాల రామకృష్ణ బహిరంగ లేఖ


ఉత్తరాంధ్రకు రూ. 15 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించి పన్ను రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఉత్తరాంధ్రలో భాగమైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో దాదాపు కోటి మంది నివసిస్తున్నారని, వారిలో అత్యధికులు ఆర్థికంగా వెనుకబడి వున్నారని తెలిపారు. 340 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండి కూడా, తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని జిల్లాల్లో అత్యంత వెనుకబడిన జిల్లా శ్రీకాకుళమని తెలుపుతూ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలపై జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ప్రస్తావించిందని తెలిపారు. ప్రధాని తక్షణం కల్పించుకుని ఉత్తరాంధ్ర ప్రజలు అభివృద్ధిలో పయనించేందుకు సహకరించాలని ఈ లేఖలో కొణతాల కోరారు.

  • Loading...

More Telugu News