: కేవీపీ బిల్లు పాసైతే... ఏపీ భవిష్యత్తు బంగారమే: ఏపీసీసీ చీఫ్ రఘువీరా


ఏపీకి ప్రత్యేక హోదాపై జరుగుతున్న ఉద్యమంలో భాగంగా తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చేపట్టిన చర్య విజయం సాధిస్తే... ఏపీ భవిష్యత్తు బంగారమేనని కాంగ్రెస్ పార్టీ ఏపీ విభాగం (ఏపీసీసీ) చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేయాలని కేవీపీ రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్లారు. దీనిపై ఈ నెల 13న జరగనున్న ఓటింగ్ కు పార్టీకి చెందిన అందరు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం త్రీలైన్ విప్ జారీ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుకు మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తున్నామని చెప్పిన ఆయన ఇప్పటికే నాలుగైదు పార్టీలు మద్దతు పలికాయన్నారు. హోదా కోసం నాడు రాజ్యసభలో పోరాడిన వెంకయ్యనాయుడు, హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడులు ఈ బిల్లుకు మద్దతు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు వెంకయ్య, చంద్రబాబులు తమ పార్టీ ఎంపీలతో బిల్లుకు అనుకూలంగా ఓటేయించాలని కోరారు. రాజ్యసభలో బిల్లు పాసైతే ఏపీ భవిష్యత్తు బంగారమేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News