: సొంతూళ్లో వైఎస్ జగన్!... వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న వైసీపీ అధినేత
వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంతూరు పర్యటనకు వెళ్లారు. కడప జిల్లాలోని పులివెందులలోని తన ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్... ఇటీవల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కొద్దిసేపటి క్రితం బయలుదేరారు. నేలవాలిన పంటలను పరిశీలించిన జగన్... జరిగిన నష్టంపై అక్కడి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.