: అంబేద్కర్ వేషంలో గాంధీ విగ్రహం ముందు చిత్తూరు ఎంపీ నిరసన
ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇటీవలే కుచేలుడి వేషధారణలో ఢిల్లీలో వినూత్న నిరసన చేపట్టిన శివప్రసాద్ తాజాగా అంబేద్కర్ వేషం వేశారు. నేటి పార్లమెంటు సమావేశాలకు వచ్చే క్రమంలో అంబేద్కర్ వేషం వేసుకుని వచ్చిన శివప్రసాద్... పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు.