: ‘జంపింగ్’ల పిటిషన్ ను కొట్టేసిన ఉత్తరాఖండ్ హైకోర్టు!... స్పీకర్ నిర్ణయానికే ఓటు!


రాజకీయ సంక్షోభం నెలకొన్న ఉత్తరాఖండ్ లో ‘జంపింగ్’ ఎమ్మెల్యేలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సీఎం హరీశ్ రావత్ కు హ్యాండిచ్చి బీజేపీ పంచన చేరిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బల పరీక్షకు ఓటు హక్కు ఉండదని సర్వోన్నత న్యాయస్థానం ఇదివరకే తేల్చిచెప్పింది. అంతకుముందే స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సదరు ఎమ్మెల్యేలు నైనిటాల్ లోని ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కొద్దిసేపటి క్రితం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం స్పీకర్ నిర్ణయం సరైనదేనని ప్రకటించింది. అనర్హత వేటును తొలగించడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో రేపు ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరగనున్న హరీశ్ రావత్ బల పరీక్షలో వీరికి ఓటు హక్కు కాదు కదా, అసలు అసెంబ్లీలోకే ప్రవేశం దక్కని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News