: లోయలో పడ్డ వోల్వో బస్సు... ‘తూర్పు’లో 8 మంది దుర్మరణం
తూర్పు గోదావరి జిల్లాలో నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిండా ప్రయాణికులతో ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒడిశాకు బయలుదేరిన వోల్వో బస్సు లోయలో పడిపోయింది. జిల్లాలోని మారేడుమిల్లి మండలం ఇజ్జలూరి జంక్షన్ వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 ప్రయాణికులున్నారని, వీరిలో 35 మందికి పైగా గాయాలయ్యాయని సమాచారం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 8 మంది చనిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.