: ఓపెన్ టాప్ జీపులో పర్యటిస్తున్న మహేష్ బాబు


సినీ నటుడు మహేష్ బాబు తన దత్తత గ్రామం బుర్రిపాలెంలో ఓపెన్ టాప్ జీపులో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్, మహేష్ బాబాయి తదితరులు ఉన్నారు. జీపులో పర్యటిస్తున్న మహేష్ గ్రామస్తులకు చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్నారు. అంతకుముందు, అభివృద్ధి పనుల పైలాన్ ను ఆవిష్కరించారు. బుర్రిపాలెంలో పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద బాలికలకు పత్రం, దేవరకోట ఆలయానికి ఒక లక్ష రూపాయలు విరాళంగా మహేష్ అందజేశారు.

  • Loading...

More Telugu News