: బాల్కనీలో నుంచి అభివాదం చేసిన మహేష్


బుర్రిపాలెంలోని తమ తాతయ్య భవనంలో ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు బాల్కనీలోకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మహేష్ ను చూసేందుకు అక్కడికి భారీగా తరలివచ్చిన అభిమానులు, గ్రామస్తులు కేరింతలు కొట్టారు. అంతకుముందు, ఎంపీ గల్లా జయదేవ్, అధికారులు, బుర్రిపాలెం గ్రామపెద్దలు, తదితరులతో గ్రామ సమస్యలతో పాటు పలు విషయాలను మహేష్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఓపెన్ టాప్ జీప్ లో గ్రామంలోని వీధుల్లో మహేష్ బాబు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది నిమిషాలలో జరగనున్న ప్రెస్ మీట్ లో మహేష్ మాట్లాడనున్నారు.

  • Loading...

More Telugu News