: పాలేరులో టీఆర్ఎస్ ఓడిపోతే నా పదవి వదులుకుంటా: కేటీఆర్
ఖమ్మం జిల్లా పాలేరు ఉపన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే తన పదవిని వదులుకుంటానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. అదేకనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తుచేశారు. కాగా, ఈ నెల 16న ఈ ఉప ఎన్నిక జరగనుంది. చాలా కట్టుదిట్టంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు ఎన్నికల పరిశీలకులను నియమించిన విషయం తెలిసిందే.