: రన్ వే నుంచి జారిన విమానం... ఆందోళనకు గురైన ప్రయాణికులు
విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ ఓ విమానం రన్ వేపై నుంచి పక్కకి జారి అధికారులు, ప్రయాణికులను ఆందోళనలోనికి నెట్టిన ఘటన గత రాత్రి ఇండోర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 9 డబ్ల్యూ 2793 విమానం ఢిల్లీ నుంచి 66 మంది ప్రయాణికులతో ఇండోర్ చేరుకుంది. ల్యాండింగ్ కు క్లియరెన్స్ ఇచ్చిన తరువాత విమానం ల్యాండ్ అవుతూ రన్ వే పై నుంచి పక్కకి జారిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల్లో ఆందోళన రేగింది. విమానం కుదుపుకు లోను కావడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అప్పటి వరకు గుండెలరచేతుల్లో పెట్టుకుని కూర్చున్న ప్రయాణికులు, చివరికి ఏమీ కాలేదని తెలిసి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ సిబ్బంది వేగంగా స్పందించి నలుగురు సిబ్బంది సహా 66 మంది ప్రయాణికుల్ని బస్సుల్లో తరలించారు.