: చల్లబడిన తెలంగాణ... రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు


తెలంగాణ వ్యాప్తంగా శనివారం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాజధాని హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో సాయంత్రం నుంచి అడపా దడపా వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, తార్నాక, హబ్సీగూడ, పటాన్ చెరు, నాచారాం, మల్లాపూర్, యూసఫ్ గూడ తదితర ప్రాంతాల్లో మోస్తరుగా వర్షం కురిసింది. నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ సహా మరికొన్ని జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైంది. మరోసారి గాలివాన రావడంతో నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి, మోర్తాడ్, ఆర్మూరు మండలాల్లో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కాగా, తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడం వల్ల నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం శనివారం వెల్లడించింది.

  • Loading...

More Telugu News