: యూనివర్సిటీ విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. నలుగురిపై కేసు
జాదవ్ పూర్ యూనివర్సిటీ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించి వేధింపులకు పాల్పడిన ఘటనలో యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. కోల్ కతాలో జాదవ్ పూర్ యూనివర్సిటీలో శుక్రవారం నిరసనలు, గందరగోళం నడుమ 'వివేక్ బుద్ధ ఇన్ ఏ ట్రాఫిక్ జామ్' చిత్రాన్ని బహిరంగంగా ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థినులపై బయటి నుంచి వచ్చిన కొందరు వేధింపులకు పాల్పడినట్టు వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై వీసీ సురంజాస్ దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు వీసీ సురంజాస్ దాస్ శనివారం మీడియాతో అన్నారు. అయితే, తాను ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు ఏబీవీపీ కార్యకర్తలు ఉన్నట్టు సమాచారం.