: మోదీ నకిలీ డిగ్రీపై కాంగ్రెస్ గళం విప్పదు, చాపర్ స్కాంలో సోనియాను బీజేపీ అరెస్టు చెయ్యనివ్వదు: కేజ్రీవాల్
అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలను ఎక్కుపెట్టారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాను అరెస్టు చేయించడానికి ప్రధాని మోదీ భయపడుతున్నారని అన్నారు. అంతేకాదు, బీజేపీ, కాంగ్రెస్‌లకి మధ్య ఓ సెటిల్‌మెంట్ జరిగిందని ఆరోపించారు. దాని ప్రకారమే కాంగ్రెస్.. ప్రధాని మోదీ నకిలీ డిగ్రీపై గళం విప్పట్లేదని, అలాగే బీజేపీ అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం కేసులో సోనియా గాంధీని అరెస్టు చేయట్లేదని అన్నారు. ఇటాలియన్ కోర్ట్ సోనియా గాంధీ, అహ్మద్ పటేల్ తో పాటు పలువురు అధికారులు, కాంగ్రెస్ నేతల పేర్లను ప్రకటించిందని.. అయినప్పటికీ సోనియా గాంధీని అరెస్టు చేయడానికి మోదీకి ధైర్యం చాలడం లేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.