: అగస్టా కుంభకోణం... సోనియా, మన్మోహన్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ పిటిషన్: నేడు సుప్రీంలో విచారణ
దేశంలో 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణాల తరువాత ఆ స్థాయిలో మళ్లీ కాంగ్రెస్‌ను కుదిపేస్తోన్న అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియాగాంధీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణం కేసులో ఇటాలియన్ కోర్టు తమకు పలువురి పేర్లు ఇచ్చిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సదరు వ్యక్తుల పేర్లను ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విచారణలో వారిని ప్రతివాదులుగా చేర్చారు.