: విభేదాల నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీతో ఉత్త‌రప్ర‌దేశ్ సీఎం భేటీ... స‌ర్వ‌త్ర ఆస‌క్తి


ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ భేటీ అయ్యారు. అఖిలేష్ ప్ర‌భుత్వం, కేంద్రానికి మ‌ధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు చెల‌రేగుతోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే లాతూరు త‌ర‌హాలో ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో తీవ్ర నీటి ఎద్ద‌డి ఎదుర్కుంటోన్న బుందేల్‌ఖండ్‌లో ప్ర‌జ‌ల‌కు కేంద్రం నీటి రైలుని పంపింది. కానీ, ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం దాన్ని అడ్డుకుంది. కరవు ప‌రిస్థితుల్ని ఎదుర్కునేందుకు త‌మ‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులివ్వాల‌ని డిమాండ్ చేసింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని కార్యాల‌యంలో మోదీతో అఖిలేశ్ భేటీ స‌ర్వ‌త్ర ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నీటి ఎద్ద‌డిపై చ‌ర్చించేందుకు కొద్ది రోజుల క్రితం ప‌లు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు ప్ర‌ధాని లేఖ రాశారు. దీంతో అఖిలేశ్ ఈరోజు న్యూఢిల్లీలో పీఎం కార్యాల‌యంలో మోదీతో భేటీ అయ్యారు. చర్చల అనంత‌రం ఉత్త‌రప్ర‌దేశ్‌లో నీటి ఎద్ద‌డిపై కేంద్రం నుంచి ఎటువంటి ప్ర‌క‌ట‌న వ‌స్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News