: వంద శాతం ఫీజులు పెంచేశారు.. తగ్గించాల్సిందే... 'కల్ప స్కూల్' ముందు తల్లిదండ్రుల ఆందోళన
ప్రతీ ఏడాది ఫీజులు పెంచుకుంటూ వస్తూ.. కేవలం నాలుగేళ్లలో ఏకంగా వందశాతం ఫీజులు పెంచేశారంటూ హైదరాబాద్, బంజారా హిల్స్ 'కల్ప స్కూల్' ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన ప్రదర్శన చేపట్టారు. స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ‘సే నో టూ ఫీ హైక్, డౌన్ విత్ ఫీ హైక్’ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీజుల పెంపుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.