: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు తప్పిన ముప్పు... కారును ఢీ కొట్టిన మంత్రి బైక్.. స్వల్ప గాయాలు!
నిన్న సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన కుమార్తెను రిసీవ్ చేసుకోవడానికి మంత్రి సరదాగా తన బైక్ పై ఎయిర్ పోర్టుకి బయలుదేరారు. మంత్రికి చెందిన 'ఆడీ' కారులో సెక్యూరిటీ ఆయనను అనుసరించింది. ఈ లోగా నగర శివారులో ఆయనకు ఎదురుగా వెళుతున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో, ఈయన బైక్ ఆ కారుని ఢీ కొట్టింది. దాంతో మంత్రికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెనువెంటనే స్పందించిన ఆయన భద్రతా సిబ్బంది ఆయనను హుటాహుటిన అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు తరలించారు. మంత్రికి అయిన గాయాలు చిన్నవేనని పేర్కొన్న అక్కడి వైద్యులు సుప్రియో ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ప్రకటించారు.