: వాట్సాప్ ను బ్యాన్ చేయాలని డీవోటీని కోరిన వొడాఫోన్, ఎయిర్ టెల్


వాట్సాప్ భారతీయుల చేతిలో సమాచార వారధిగా మారిపోయి రోజురోజుకూ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ ఉచిత కాల్స్, మేస్సేజీలను ఆఫర్ చేస్తుండడంతో దిగ్గజ టెలికాం కంపెనీలు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలో కలవరం మొదలైంది. ఇలాంటి యాప్స్ ను నిషేధించాలని ఈ కంపెనీలతో కూడిన సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా టెలికామ్ శాఖను కోరింది. ఈ మేరకు టెలికామ్ శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ కు లేఖ రాసింది. మొబైల్, ల్యాండ్ లైన్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ కాల్స్ ను అనుమతించడం నిబంధనలకు వ్యతిరేకమని లేఖలో కంపెనీలు పేర్కొన్నాయి. ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. ఇంటర్నెట్ టెలిఫోన్ కాల్స్ ను అనుమతించవద్దని ఈ మేరకు లైసెన్స్ దారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్లప్తి చేశాయి.

  • Loading...

More Telugu News