: టీఆర్ఎస్ శాసన సభా పక్షంలో వైసీపీఎల్పీ విలీనం పూర్తి


తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం అంతర్థానం అయిపోయింది. శుక్రవారం వైసీపీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ శాసన సభా పక్షంలో విలీనం చేస్తూ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శాసనసభా కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడివడిన తర్వాత తెలంగాణలో అదీ ఒక్క ఖమ్మం జిల్లాలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభించింది. ఆ జిల్లాలో మూడు శాసనసభా స్థానాలతోపాటు ఖమ్మం ఎంపీ స్థానాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, సీఎం కేసీఆర్ ఆకర్షణ మంత్రంతో వైసీపీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మదన్ లాల్ టీఆర్ఎస్ లో చేరిపోయారు. ముగ్గురిలో ఇద్దరు చేరిపోవడంతో శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని కోరుతూ గతంలోనే వారు స్పీకర్ కు లేఖ రాశారు. తాజాగా వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న మరో ఏకైక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతోపాటు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా టీఆర్ ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. పాయం కూడా వైసీపీ శాసన సభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు స్పీకర్ కు లేఖ రాశారు. దీంతో స్పీకర్ వైసీపీ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీలో విలీనం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News