: సహారా అధినేతకు నాలుగు వారాల పెరోల్
మదుపరుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిధులు సమీకరించిన కేసులో గత రెండేళ్ల నుంచీ తీహార్ జైలులో గడుపుతున్న సహారా గ్రూపు అధినేత సుబ్రతా రాయ్ కి పెరోల్ మంజూరైంది. సుప్రీంకోర్టు ఆయనను నాలుగు వారాల పెరోల్ పై విడుదల చేయడానికి ఈ రోజు ఆదేశాలిచ్చింది. సుబ్రతారాయ్ తల్లి చబీ రాయ్ వృద్ధాప్యపు సమస్యలతో బాధపడుతూ ఈ తెల్లవారుజామున మరణించడంతో, ఆమె అంత్యక్రియలలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవడంతో, సుబ్రతారాయ్ కి దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ పెరోల్ మంజూరు చేసింది. కాగా, పెరోల్ పై వుండే సమయంలో ఆయన కదలికలను గమనించే బాధ్యతను పోలీసులకు అప్పగించారు.