: పెళ్లైన ఐదు రోజులకే విడాకులు మంజూరు చేసిన సౌదీ న్యాయస్థానం!
పెళ్లైన ఐదురోజులకే ఓ మహిళకు సౌదీ అరేబియా న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. సౌదీకి చెందిన ఓ మహిళకు వారం రోజుల క్రితం వివాహం జరిగింది. అయితే తన భర్త రోజులో ఐదు సార్లు నమాజ్ చేయడం లేదని మండిపడ్డ సదరు మహిళ విడాకులు కావాలంటూ సౌదీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇస్లాం సంప్రదాయాలను తు.చ తప్పకుండా పాటించే సౌదీ న్యాయస్థానం అతను నమాజ్ చేయడం లేదని నిర్ధారించి విడాకులు మంజూరు చేసింది. అంతే కాకుండా సదరు మహిళకు అతను 55,000 సౌదీ రియాళ్లు చెల్లించాలని ఆదేశించింది. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చను లేవదీసింది. ఇంత చిన్న విషయానికి విడాకులా? అంటూ నోరెళ్లబెట్టేవాళ్లు ఎక్కువయ్యారు. ఇంకొంతమంది 'శభాష్' అంటూ అభినందిస్తున్నారు.