: సుప్రీం గడప తొక్కిన ‘అగస్టా’!... పిల్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం


కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేసిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసు తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ వ్యవహారంపై విచారణ పూర్తి చేసిన ఇటలీ కోర్టు ఇటీవలే తుది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు భారత్ లో పెను రాజకీయ దుమారాన్ని రేపింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రస్తావన సదరు కోర్టు తీర్పు కాపీలో చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టులో ఓ వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇటలీ కోర్టు ఇచ్చిన తీర్పులో ప్రస్తావనకు వచ్చిన భారతీయులపై కేసులు నమోదు చేయాలని సదరు పిటిషనర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రం, సీబీఐలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News