: మద్యం తాగి, వ్యాయామ ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తన
మద్యం తాగిన వ్యాయామ ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏఎన్ యూ)లో చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా ఏపీలోని అన్ని జిల్లాల వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఇక్కడ జరుగుతున్నాయి. కొందరు వ్యాయామ ఉపాధ్యాయులు మద్యం తాగి వచ్చి మహిళా ఉపాధ్యాయురాలితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో, అక్కడే ఉన్న మిగిలిన మహిళా ఉపాధ్యాయురాళ్లు పరుగులు తీశారు. ఈ సంఘటనపై పై అధికారులకు వారు ఫిర్యాదు చేశారు.