: షారూఖ్ ఆస్తి 600 మిలియన్ డాలర్లు!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రపంచ ధనవంతులైన నటుల్లో రెండో స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే నటుడిగా నిలిచిన షారూఖ్, కోల్ కతా నైట్ రైడర్స్, రెడ్ చిల్లీ ఎంటర్ టైన్ మెంట్స్ సహా పలు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్నాడు. బాలీవుడ్ లో తెలివైన మదుపరిగా పేర్కొనే షారూఖ్ ఖాన్ ఆస్తులన్నీ కలుపుకుని 600 మిలియన్ డాలర్లు ఉంటాయని తెలుస్తోంది. అంటే రూపాయల్లో చెప్పాలంటే 3979,19,70,000. 1989లో టీవీ సీరియల్ ద్వారా నట ప్రస్థానం ఆరంభించిన షారూక్ బాలీవుడ్ లో నెంబర్ వన్ నటుడిగా నిలిచి, అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడు. ప్రపంచంలోనే సెకెండ్ రిచెస్ట్ నటుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు.