: విశాఖ మన్యంను వణికిస్తున్న ఆంత్రాక్స్


ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన ఆంత్రాక్స్ వ్యాధి ఇప్పుడు విశాఖ మన్యాన్ని వణికిస్తోంది. ఎబోలాకి ముందు స్వైన్ ఫ్లూ, అంతకు ముందు ఆంత్రాక్స్ వ్యాధులు మానవాళిన భయపెట్టాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన టీకా కనుగొన్నారు. దీంతో ఆంత్రాక్స్ ఆటలు సాగలేదు. కానీ విశాఖ మన్యంలో మాత్రం అప్పుడప్పుడు ఆంత్రాక్స్ వ్యాధి కనిపిస్తూ ఆందోళన రేపుతోంది. తాజాగా హుకుంపేట మండలం పనసపుట్ట గ్రామంలో 10 మందికి ఆంత్రాక్స్ సోకింది. రెండు పశువులకు ఈ ఆంత్రాక్స్ సోకిందని, దాని నుంచి గ్రామస్థులకు సోకిందని వైద్యులు గుర్తించారు. జంతువుల నుంచి ఈ వ్యాధి మనుషులకు సోకుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ వైద్యులు ఆప్రమత్తమయ్యారు. పది వేల టీకాలను పశువుల కోసం సిద్ధం చేశారు.

  • Loading...

More Telugu News