: ఇకపై మీ గోళ్లను మీరు నిరభ్యంతరంగా నాకొచ్చంటున్న కేఎఫ్ సీ!


గోళ్లు నాకడాన్ని చెడు అలవాటుగా, అనారోగ్యకరమైనదిగా వైద్యులు చెబుతారు. చేతులు శుభ్రంగా కడుక్కున్న తరువాతే భోజనం చేయాలని చెబుతారు. అలాంటిది ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సంస్థ కేఎఫ్ సీ మాత్రం మీకు నచ్చినప్పుడు మీ గోళ్లను నాకవచ్చని చెబుతోంది. మొదటి నుంచీ కేఎఫ్ సీ ట్యాగ్ లైన్ 'ఫింగర్ లికింగ్ ఈస్ గుడ్'. ఇప్పుడు ఈ నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు కేఎఫ్ సీ నడుం బిగించింది. హాంగ్ కాంగ్ లో కేఎఫ్ సీ సౌందర్య సాధనాల ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించింది. ఒరిజనల్, హాట్ అండ్ స్పైసీ పేరుతో రెండు చికెన్ ఫ్లేవర్డ్ నెయిల్ పాలిష్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇతర నెయిల్ పాలిష్ లలాగే వాటిని గోళ్లకు వేసుకోవచ్చని, కోరుకున్నప్పుడు ఆ గోళ్లను చప్పరిస్తూ చికెన్ ఫ్లేవర్ ను ఆస్వాదించవచ్చని, దాని వల్ల ఎటువంటి హానీ జరగదని కేఎఫ్ సీ హామీ ఇస్తోంది. అంతే కాకుండా ఈ ఒరిజనల్, హాట్ అండ్ స్పైస్ ఫ్లేవర్లలో ఏది బాగుందో చెప్పాలని హాంగ్ కాంగ్ వాసులను కోరింది. దీనికి ఆదరణ లభిస్తే దానిని పెద్ద మొత్తంలో తయారు చేస్తామని చెబుతోంది.

  • Loading...

More Telugu News