: సవతి తల్లి అమ్మేసింది...గోవా ఎమ్మెల్యే 50 లక్షలకి నన్ను కొన్నాడు: అత్యాచారం బాధిత బాలిక


గోవా ఎమ్మెల్యే బాబుష్ మొన్సిరేట్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మొన్సిరేట్ ఓ మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఇరుక్కున్న సంగతి విదితమే. కొన్ని వారాల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పలు అంశాలు వెలుగు చూస్తున్నాయి. బాలల కమిటీ ముందు బాలిక ఇచ్చిన వాంగ్మూలం వివరాల్లోకి వెళితే... నేపాల్ కు చెందిన తనను ఉద్యోగం కోసం మొన్సిరేట్ ను కలవాల్సి ఉందని, బాగా తయారవ్వమని తన సవతి తల్లి చెప్పిందని తెలిపింది. అలాగే ముస్తాబైన తనను మొన్సిరేట్ బంగ్లాకు తీసుకెళ్లారని చెప్పింది. అక్కడ మొన్సిరేట్ తనతో మద్యం తాగించాడని తెలిపింది. తెల్లారి లేచి చూసేసరికి తన ఒంటిపై నూలుపోగు లేదని, తన శరీరం రక్తంతో తడిసిపోయి వుందని గుర్తు చేసుకుంది. తన పక్కనే ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా ఎమ్మెల్యే కూర్చుని ఉన్నాడని ఆమె ఆనాటి సంఘటనను వివరించింది. ఆ తరువాత ఆయన తనను 50 లక్షల రూపాయలకు కొనుక్కున్నాడని, తన సవతి తల్లి తనను మోసం చేసిందని తెలిసిందని వెల్లడించింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో వున్న మొన్సిరేట్ ను గతేడాది పార్టీ బహిష్కరించింది. అప్పటి నుంచీ ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అయితే, ఈ అత్యాచారానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఎమ్మెల్యే, తాజాగా పోలీసులకు లొంగిపోయాడు. దీంతో ఆమె వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News