: అన్నాడీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల... ప్రజలపై వరాల జల్లులు


తమిళనాట ఎన్నికల హీట్ పెరుగుతోంది. గెలుపు కోసం అన్నాడీఎంకే, డీఎంకేలు తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ నేపధ్యంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో తమిళనాడు ప్రజలపై వరాల జల్లు కురిపించారు. రైతులకు రుణమాఫీ వర్తింపచేస్తామని అన్నారు. రైతులకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు ఫ్రీ ఇంటర్నెట్, విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ లను పంపిణీ చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎవరైనా మహిళలు ద్విచక్రవాహనం కొనుగోలు చేస్తే 50 శాతం రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా 500 రూపాయల విలువ చేసే కూపన్లు అందజేయనున్నామని చెప్పారు. మహిళా ఉద్యోగులకు 18,000 రూపాయల ప్రసూతి సాయం అందజేయనున్నామని వెల్లడించారు. స్కూల్ విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందజేయనున్నామని, ఉచిత సెట్ టాప్ బాక్సులు, రేషన్ కార్డులు ఉన్నవారికి ఉచిత సెల్ ఫోన్లు ఇవ్వనున్నామని అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News