: జగన్ ధర్నాను స్వాగతిస్తున్నాం: ఏపీ మంత్రి మాణిక్యాలరావు
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జగన్ ధర్నాను స్వాగతించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేపడతామని చెబుతున్న సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేపట్టనున్న ధర్నా మంచిదేనని ఆయన అన్నారు. జగన్ ధర్నా చేయడం వల్ల ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మిత్రధర్మం మేరకు తమ నిర్ణయాలకు మద్దతు తెలపాల్సిన టీడీపీ...ప్రత్యేకహోదా విషయంలో తమను దోషిని చేయడం, టీడీపీ నేతలు నేరుగా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టడంతో ఆయన జగన్ కు మద్దతు పలికేలా వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.