: ఉజ్జయిని కుంభమేళాలో విషాదం..తొక్కిసలాటలో ఆరుగురి మృతి
ఉజ్జయిని సింహస్థ కుంభమేళాలో విషాదం చోటుచేసుకుంది. ఉజ్జయినిలో కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, భారీ వర్షం కురవడంతో కుంభమేళాలో పాల్గొనే భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కూలాయి. దీంతో భక్తులు పరుగందుకున్నారు. ఈ క్రమంలో ఏర్పడిన గందరగోళంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఆరుగురు భక్తులు మృతిచెందగా, 40కి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సహాయక సిబ్బంది సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు.